బాలీవుడ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ.!

సౌత్ హీరోలు, నార్త్‌లో.. నార్త్ హీరోలు సౌత్‌లో నటిస్తూ సౌత్ – నార్త్ అనే బేధాల్ని తుడిచేశారు. ఇండియన్ సినిమా అనే ఫీల్ క్రియేట్ చేశారు. దాంతో, అక్కడి వాళ్లు ఇక్కడా.. ఇక్కడి వాళ్లు అక్కడా నటించడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది.

మరోవైపు ప్యాన్ ఇండియా ట్రెండ్ ఎలాగూ నడుస్తోంది. ఆల్రెడీ ఎన్టీయార్ ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా నందమూరి నట సింహం బాలకృష్ణకూ బాలీవుడ్ నుంచి పిలుపొచ్చిందట.

ఓ స్టార్ హీరో సినిమాలో బాలయ్య నటించబోతున్నారట. నిడివి చాలా తక్కువేనట. కేవలం 20 నిముషాల పాటు మాత్రమే బాలయ్య పాత నిడివి వుండనుందట. అయితే, అది ఏ హీరో సినిమా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. కానీ, బాలయ్యకు ఆఫర్ రావడం నిజమే అంటున్నారు.

టాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ బ్యానర్ ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించబోతోందనీ తెలుస్తోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి వుంది. అన్నట్లు ఆల్రెడీ టాలీవుడ్ స్టార్ హీరో అయిన నాగార్జున ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు బాలయ్య తాజాగా ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి, బాబీ సినిమా కోసం సంసిద్ధమవుతున్నారు. అలాగే, అన్‌స్టాపబుల్ సీజన్ కోసం ఓటీటీలోనూ సందడి చేయబోతున్నారు.

మరోవైపు పాలిటిక్స్.. ఇంకో వైపు తాజాగా బాలీవుడ్ గెస్ట్ రోల్స్.. వావ్.! వాట్ ఏ బిజీ బాలయ్యా.! జై బాలయ్య.!