సాధారణంగా ఇద్దరు హీరో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ నడుస్తుంది కానీ వ్యక్తిగతంగా ఆ హీరోల మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి అనుబంధం ఉన్న వారిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఒకరు. వీరిద్దరి మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంచి స్నేహ బంధం ఉంది. ఈ క్రమంలోనే గతంలో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా పైరసీ విషయంలో పవన్ కళ్యాణ్ తనకు ఎంతో సపోర్ట్ చేశారు.అదే విధంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఈ విధంగా ఈ ఇద్దరు హీరోల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.ఇక మహేష్ బాబు భార్య నమ్రత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మధ్య మంచి స్నేహ బంధం ఉంది. క్రిస్మస్ సందర్భంగా అన్నా లెజీనోవా మహేష్ బాబు దంపతులకు కానుకలు పంపిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ హీరోలు ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంది. అయితే వీరి అభిమానుల వల్ల వీరిద్దరు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇంతకీ పవన్ కళ్యాణ్ కోసం ఏ సినిమా స్పెషల్ షో ప్లాన్ చేశారు అనే విషయానికి వస్తే…మహేష్ బాబు సోని పిక్చర్స్ తో కలిసి నిర్మించిన మేజర్ సినిమాని పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన హీరోలందరికీ కలిపి స్పెషల్ షో ప్లాన్ చేసి చూపించాలని నమ్రత ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నమ్రత చెప్పిన సలహాకు మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కావడంతో ముందుగానే ఈ సినిమాని స్పెషల్ షో ద్వారా టాలీవుడ్ ప్రముఖ హీరోలందరికీ చూపించాలని నమ్రత ప్లాన్ చేసినట్లు సమాచారం.