ఏజెంట్’ సినిమా దారుణంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లాప్ కారణంగా అఖిల్‌లో వచ్చిన మార్పు పెద్దగా ఏమీ లేదు. కానీ, ఈ డిజాస్టర్ వల్ల నిర్మాతలు దారుణంగా నష్టపోయారు. ఇలా నష్టపోయిన నిర్మాతలకూ, డిస్ర్టిబ్యూటర్లకూ తెర వెనుక సెటిల్మెంట్లు చేయడంలో నాగార్జున బిజీగా వున్నాడట.
ఈ టెన్షన్‌లో వుండగానే, లేటెస్ట్‌గా ‘కస్టడీ’ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అయినప్పటికీ, ఇది కూడా ఫ్లాప్ లిస్టులోకే చేరిపోయింది.
ఏజెంట్’ నష్టాలే పూడ్చలేక కిందా మీదా పడుతున్న నాగార్జునకు మూలిగే నక్క మీద తాటిటెంక మాదిరి తయారయ్యింది ‘కస్టడీ’ ఫ్లాప్.
దాంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో నాగార్జున వున్నాడట. మరోవైపు అఖిల్ పెద్ద బడ్జెట్ సినిమాలకు తప్ప, ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను ఒప్పుకునేందుకు ససేమిరా అనడం మరింత తలనొప్పిగా మారిందట నాగార్జునకి.
ఈ తలనొప్పిని ఎలా తట్టుకోవాలో తెలియక నాగార్జున తల పట్టుకుంటున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్‌లో టాక్ వినిపిస్తోంది.