‘ఏజెంట్’ కోసం చరణ్ – ఎన్టీయార్.!

ఎంత చేసినా అక్కినేని హీరో అఖిల్ హీరోగా తన గుర్తింపును చాటుకోలేకపోతున్నాడు. ముచ్చటగా చేసిన మూడూ సినిమాలూ అఖిల్‌కి పెద్దగా కలిసి రాలేదు. ఇక ప్రస్తుతం ‘ఏజెంట్’తో రాబోతున్నాడు. స్టైలిష్ అండ్ ఫెయిల్యూర్ ఎరుగని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. సో, ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.

నిజానికి ఎప్పుడో రావాల్సిన సినిమా ఇది. వాయిదాల పర్వం ముగించుకుని, ఏప్రిల్‌లో రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడట నాగార్జున. అందులో భాగంగానే, గ్లోబల్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీయార్‌లను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట.

నాగార్జున అడిగితే, చరణ్ – ఎన్టీయార్ నో అనడానికేం ఛాన్స్ లేదు. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చరణ్, ఎన్టీయార్‌కి మంచి సాన్నిహిత్యం వుంది. కానీ, ‘ఏజెంట్’ అయినా అఖిల్‌ని ఆదుకుంటుందో లేదో అన్నదే అనుమానం. చూడాలి మరి.