ఏజెంట్ హిట్టయితే నాగార్జునకు బెస్ట్ ఛాన్స్?

ఇటీవల కాలంలో చాలామంది సీనియర్ హీరోలు స్టార్ హీరోలు చిన్న హీరోలు ఇలా తేడాలు లేకుండా మంచి కంటెంట్ దొరికితే మాత్రం ఫ్యాన్ ఇండియా సినిమాలో చేసేందుకు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే అగ్ర హీరోలలో చాలామంది అటువైపు అడుగులు వేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అక్కడ సైరా సినిమాతో ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.

అయినప్పటికీ మెల్లగా హిందీ మార్కెట్లో ఆయన పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక బాలకృష్ణ ఇప్పటివరకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. ఇక వెంకటేష్ సైంధవ సినిమాతో ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సీనియర్ హీరోలలో నాగార్జున మాత్రమే అటువైపుగా ఇప్పుడు పాన్ ఇండియా ప్రయత్నాలు చేయడం లేదు. కానీ ఆయనకు హిందీ లాంగ్వేజ్ కొత్తేమీ కాదు. ఇటీవల వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాతో కూడా మంచి గుర్తింపునందుకున్నాడు.

ఇక కెరీర్ మొదట్లో కూడా నాగ్ చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే ఇప్పుడు ఏజెంట్ సినిమా హిట్ అయితే మాత్రం అక్కినేని నాగార్జునకు కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాగర్జున 100వ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే అందులో అక్కినేని అఖిల్ కూడా ఒక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఏజెంట్ సినిమా సక్సెస్ అయితే అప్పుడు అఖిల్ చేసే పాత్ర ద్వారా ఆ సినిమా స్థాయి పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఏజెంట్ సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది. అలా జరిగితే నాగార్జున 100వ సినిమాకు పాన్ ఇండియా మార్కెట్లో కొంత బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక ఏజంట్ సినిమా కూడా అఖిల్ కు బిగ్ హిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాతోనే ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.