నాగ్ ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడంటే ?

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కమర్షియల్, ఆధ్యాత్మిక సినిమాలతో పాటు ‘గగనం’, ‘ఊపిరి’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేశారాయన. ఇప్పుడు అలాంటి మరో సినిమాతో వస్తున్నారు కింగ్.నాగార్జున టైటిల్ రోల్‌లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు.

వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఖరారు

ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. నిజానికి నాగార్జున లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కు వచ్చిన హీరోల్లో ఒకడు. గతేడాదే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా సినిమా మొత్తం సిద్ధమైంది కూడా. అయితే ఇన్నాళ్లూ ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అప్డేట్ గురించి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు మొత్తానికి వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ విడుదలవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సోలమన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. వైల్డ్ డాగ్ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించనున్నాడు. వైల్డ్ డాగ్ లో దియా మీర్జా హీరోయిన్ గా నటించింది. అలాగే సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. వైల్డ్ డాగ్ సినిమాతో మరి నాగార్జున కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.