Nagarjuna : లేటు వయసులో స్టంట్లు చేస్తున్న మన్మధుడు..!

Nagarjuna:బంగార్రాజు మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నాగ్..ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఘోస్ట్ అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగార్జున ఒక సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు.ఇందులో ముందుగా నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే ఆమె గర్భవతి కావడంతో సినిమా నుంచి తప్పుకుంది.కాజల్ స్థానంలోకి సోనాల్ చౌహన్ హీరోయిన్ గా తీసుకున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.

ఘోస్ట్ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నా నాగార్జున పాత్రకు యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట. ఇందులో భాగంగానే ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఎడారి ప్రాంతంలో దీనికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు, నాగార్జున యంగ్ హీరోల స్టంట్స్ చేస్తూ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాడు.ఇందులో భాగంగా నాగ్ అడ్వెంచర్‌ బైక్‌ స్టంట్స్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.నాగ్ డెడికేషన్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

దుబాయ్ ఎడారి లో షూటింగ్ అంటే అది ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు,అలాంటిది కింగ్ నాగార్జున అక్కడ బైక్ స్టంట్ చేస్తున్న తీరుకి అభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా తమ హీరో జాగ్రత్త అంటూ ప్రవీణ్ సత్తార్ కు కామెంట్లు కూడా పెడుతున్నారు.గరుడవేగ అలాంటి సినిమా తర్వాత ప్రవీణ్ నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమైంది