Nagarjuna : గోస్ట్ దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నాగ్..!

Nagarjuna: బంగార్రాజు మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నాగ్..ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఘోస్ట్ అనే మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగార్జున ఒక సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నారు.ఇందులో ముందుగా నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే ఆమె గర్భవతి కావడంతో సినిమా నుంచి తప్పుకుంది.కాజల్ స్థానంలోకి సోనాల్ చౌహన్ హీరోయిన్ గా తీసుకున్నారు.

ఘోస్ట్ సినిమాలో సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నా నాగార్జున పాత్రకు యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట.సినిమా కు సంబంధించిన దుబాయి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు చేజింగ్ సన్నివేశాలు ఇంకా హీరో హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా నేడు దుబాయ్ లో షూటింగ్ పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దుబాయ్‌ షెడ్యూల్‌ తో సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి విడుదల తేదీ ని అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల సమాచారం .ఈ ఏడాది ఇప్పటికే బంగార్రాజు సినిమా తో సక్సెస్ దక్కించుకున్న నాగార్జున ఖచ్చితం గా ఘోస్ట్ సినిమా తో మరో విజయాన్ని ఈ సంవత్సరం లోనే దక్కించుకుంటాడు అని అక్కినేని అభిమానులు చాలా నమ్మకం తో ఎదురు చూస్తున్నారు.