ఎన్నో అపార్ధాలు, ఎన్నో అనుమానాల మధ్య శోభిత దూళిపాళ్ల, నాగచైతన్య పెళ్లి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. డిసెంబర్ 4న జరగబోయే ఈ పెళ్లికి హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియో వేదిక కాబోతుంది. నాగార్జున ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు పెళ్లి విషయంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చాడు. ఈ సంవత్సరం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, మా నాన్నగారి శతజయంతి వేడుక కూడా నిర్వహించాం. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వీరి పెళ్లి జరగడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఈ స్టూడియో మా కుటుంబ వారసత్వంలో ఒక భాగం.
మా నాన్నకి చాలా ఇష్టమైన ప్రదేశం అని చెప్పుకొచ్చిన నాగార్జున చైతన్య పెళ్లి చాలా సింపుల్గా చేస్తున్నట్లు, చైతన్య కోరిక మేరకే కేవలం 300 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు అలాగే పెళ్లి పనులు చైతన్య శోభిత ఇద్దరే చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే కాబోయే కోడలు శోభిత గురించి మాట్లాడుతూ ఆమె ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ఈ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడిందని కోడలిపై ప్రశంసలు కురిపించారు.
శోభిత తల్లిదండ్రులు సాంప్రదాయపద్ధంగా పెళ్లి చేయాలని కోరారని తనకి కూడా పెళ్లి మంత్రాలు వినడం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చిన నాగార్జున ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి రిసెప్షన్ వివరాలు మాత్రం అప్పుడే చెప్పలేను అన్నారు. అయితే ఈ పెళ్లి నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు రావడానికి మధ్య ఎన్నో రూమర్స్ బయటకు వచ్చాయి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే సమయంలో సడన్గా వేణు స్వామి నాగచైతన్య శోభితని వివాహం చేసుకుంటే 2027లో విడాకులు తీసుకుంటారని చెప్పారు.
దీంతో అందరూ ఈ పెళ్లి ఆగిపోతుందని అనుకున్నారు. ఇలాంటి రూమర్స్ వస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో చైతన్య, శోభితల పెళ్ళికార్డు వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏదైతేనేమి మొత్తానికి అనేక అనంతరాలు దాటుకొని చైతన్య, శోభిత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ జంట కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.