కార్తీ, పునీత్,పవన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెర మీద ప్రచారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల “ది గోస్ట్” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. తమిళ హీరో కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

 

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగులో సమర్పించటం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక కార్తీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఊపిరి సినిమా చేసినప్పటినుండి కార్తీతో మంచి అనుబంధము ఉందని చెప్పుకొచ్చాడు.ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని నాగార్జున వెల్లడించాడు. తమిళ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్య తమ్ముడైన కార్తీ ఆ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి ఇలా తనని తాను ప్రూవ్ చేసుకోవటం చాలా అరుదు అంటూ చెప్పుకొచ్చాడు.

 

ఇప్పటికీ వరకు నేను ఇలాంటి వారిని ముగ్గురిని చూసా. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, కన్నడ లో స్టార్ హీరో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్, తమిళ్ లో సూర్య తమ్ముడు కార్తీ ఇలా స్టార్ డమ్ సంపాయించడం మామూలు విషయం కాదు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య లాగా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. కార్తీక్ తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో మాట్లాడటమే కాకుండా పాటలు కూడా పాడుతాడు. ప్రస్తుతం కార్తీ నటించిన ఈ సర్దార్ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగార్జున వెల్లడించారు.