సీతారామం సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున.. పాత రోజులు గుర్తుకు వచ్చాయి?

ప్రముఖ తమిళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మొదటి తెలుగు సినిమా సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుండే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా మృణాల్‌ ఠాకూర్‌ నటించగా.. రష్మీక మందన్న కీలకపాత్రలో నటించింది. రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అశ్వినీ దత్ నిర్మించాడు. ఇటీవల విడుదలయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఇటీవల ఈ సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలివుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ క్రమంలో నాగార్జున సీతారామం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ క్రమంలో నాగర్జున మాట్లాడుతూ..సీతారామం లాంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ సినిమా విషయంలో స్వప్న, ప్రియాంకలు అశ్వనీదత్‌గారికి చాలా అండగా నిలిచారు. వీరు నిర్మించిన మహానటి, జాతిరత్నాలు, సీతారామం లాంటి సినిమాలు అన్నీ మంచి హిట్ అయ్యయి అంటూ నాగార్జున వెల్లడించాడు. అంతేకాకుండా సీతారామం సినిమా చూసి నేను అసూయపడ్డాను అంటూ నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు .

ఈ సినిమాలో నేను చేయవలసిన పాత్ర దుల్కర్‌కి వెళ్లింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు తాను నటించిన గీతాంజలీ, సంతోషం, మన్మథుడు లాంటి సినిమాలు గుర్తుకు వచ్చాయని నాగార్జున చెప్పుకొచ్చారు.ఇక ఈ సక్సెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతు తనను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు తెలియచేశాడు. తెలుగు ప్రేక్షకులు తన మీద చూపిస్తున్న అభిమానికి తనకి చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సీతారామం సినిమా ను హిట్ చేసినందుకు ప్రేక్షకులు కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇక నిర్మాత అశ్వీన్ దత్ మాట్లాడుతూ..మహానటి, సీతారామం లాంటి మంచి హిట్స్ ఇచ్చి దుల్కర్ సల్మాన్ ఇక తెలుగు హీరో అయిపోయాడనని వెల్లడించారు.