టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన వారసుడిగా నాగార్జున కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే నాగార్జున ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా నాగార్జునకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటోపై కామెంట్లో చేస్తున్నారు.
నాగార్జున ఈ ఫోటో తన పెళ్లినాటి ఫోటో ఇందులో నాగార్జున అచ్చం నాగచైతన్య పోలి ఉండడంతో ఈ ఫోటోని అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు. నాగార్జున తన మొదటి వివాహాన్ని దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా దగ్గుబాటి లక్ష్మితో ఏడడుగులు నడిచిన నాగార్జున వీరి వైవాహిక జీవితం ఏమాత్రం సంతోషంగా కొనసాగలేదు నాగచైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇక నాగచైతన్య చిన్నతనం అంతా తన తల్లి లక్ష్మీ దగ్గరే గడిపారు అనంతరం ఈమె చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఇక నాగచైతన్య బాల్యం మొత్తం తన తల్లి దగ్గర గడిపిన ప్రస్తుతం తన తండ్రి దగ్గరే ఉంటున్నారు. ఈ విధంగా నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులు ఇచ్చిన అనంతరం ఈయన సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే నటి అమలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు అఖిల్ జన్మించిన విషయం మనకు తెలిసిందే.