సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలి పై టాలీవుడ్‌లో కూడా మంచి ఆసక్తి నెలకొంది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తుండటంతో తెలుగు ప్రేక్షకుల దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పెరిగింది. తమిళనాడులో ఇప్పటికే భారీ హైప్ ఉన్న ఈ సినిమాకు తెలుగులో కూడా డిమాండ్ పెరుగుతోంది.
ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం నాగార్జున స్వయంగా తెలుగు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెన్నై వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిర్మాతలు ఈ రైట్స్‌కు రూ.40 కోట్లు కోరుతుండగా, నాగ్ రూ.35 కోట్ల లోపు డీల్ ఫైనల్ చేయాలని చూస్తున్నట్టు టాక్. ఇంత వరకు రిస్క్ తో కూడిన డీల్స్ కు దగ్గరగా ఉండని నాగ్, ఇప్పుడు మాత్రం సినిమా రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళ డబ్ సినిమాలు తెలుగులో హిట్టవడం అంత సులభం కాదు. కానీ లోకేష్ బ్రాండ్, రజనీ ఇమేజ్, నాగార్జున పాత్ర కలిపి ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ బడ్జెట్ పెట్టే ముందు స్పెషల్ ప్రచారం, ట్రైలర్‌కు స్పందన కీలకమవుతుంది. ఒకవేళ మొదటి రోజు టాక్ బాగుంటేనే డీలర్లకు లాభాలు ఆశించవచ్చు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, నాగ వంశీ వంటి ప్రముఖ నిర్మాతలు కూడా ఈ రైట్స్ కోసం టచ్‌లో ఉండటంతో పోటీ ఊపందుకుంది. అయినా నాగార్జున ముందుగానే రంగంలోకి దిగడం, డీల్ మీద స్పష్టత చూపించడం ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తోంది.