వెండితెర నటి అమల గురించి పరిచయం అవసరం లేదు ఈమె నిన్నటి తరం హీరోయిన్లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా అమల హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన అనంతరం హీరో నాగార్జునను పెళ్లి చేసుకుని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరమైన అమల పూర్తిగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించి అమల అందరిని మెప్పించారు.
ఈ సినిమా అనంతరం తాజాగా నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించి సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైన అమల సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా పలువురు సినీ సెలబ్రిటీల కోసం హైదరాబాద్ లో ప్రీమియర్ షో వేశారు. ఇక ఈ ప్రీమియర్ చూడటానికి నాగార్జున అఖిల్ అమల హను రాఘవపూడి, చందు మొండేటి వంటి దర్శకులు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున అమల నటనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆమె నటన చూసి కంటతడి పెట్టుకున్నారు.సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ చిత్ర బృందం ప్రశంసలు కురిపించారు. ఇకపోతే అఖిల్ సైతం తన తల్లి నటన చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఎలా మదర్ సెంటిమెంట్తో ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. మరి తొమ్మిదవ తేదీ థియేటర్లో ఏ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.