తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు ఎలాంటి మచ్చ లేకుండా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగారు. అయితే నాగేశ్వరరావు వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకుని సంచలనంగా మారారు. అయితే ఈయన కుమారుడు నాగచైతన్య సైతం సమంతను పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.అలాగే నాగార్జున రెండవ కొడుకు అఖిల్ సైతం నిశ్చితార్థం జరుపుకొని నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నారు.
ఇలా అక్కినేని ఇంట్లో పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఎంతోమంది ఈ విషయం గురించి చర్చలు జరిపారు. ఇకపోతే తాజాగా అక్కినేని ఫ్యామిలీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నాగార్జునకు ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం తనకు కూతురు లేరనే లోటు ఎప్పుడు ఉంటుందని ఆయన ఇదివరకు పలుమార్లు తెలియచేశారు. అయితే తన ఇంట్లో ఒక వారసురాలు ఉండాలని తాను ఎప్పటినుంచో కోరుకుంటున్నారట.
ఈ క్రమంలోనే నాగార్జున తన వారసురాలిగా ఒక అనాధ అమ్మాయిని దత్తత తీసుకొని నాగార్జున వారసురాలిగా ప్రకటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీలోకి అక్కినేని ఆడపడుచు అడుగు పెట్టబోతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇలాంటి వయసులో చిన్నారిని దత్తత తీసుకొని తనని పెంచి పెద్ద చేయడం ఇబ్బందిగా మారుతుందేమోనని కొందరు భావించారు. అయితే ఈ విషయంలో అఖిల్ చైతన్య అభిప్రాయాలను తెలుసుకొని వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపిన అనంతరమే నాగార్జున దంపతులు అమ్మాయిని దత్తత తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.