నాగ చైతన్య సినిమాలో నాగార్జున.!

అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య ఒక్కటే ప్రస్తుతం యాక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ఈ క్రమంలోనే ఓ ప్యాన్ ఇండియా సబ్జెక్ట్‌లో నాగ చైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మత్స్యకారుడి కథగా ఈ సినిమా కాన్సెప్ట్ వుండబోతోందనీ అంటున్నారు.

అందుకోసం ఉత్తరాంధ్రలోని సముద్ర తీర ప్రాంత మత్య్సకారులతో ఇప్పటికే నాగ చైతన్య, చందూ మొండేటి కొంత ప్రత్యేకమైన సమాచారాన్ని సేకరించారనీ వినికిడి. కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని నేచురల్‌గా ఈ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడట డైరెక్టర్ చందూ మొండేటి. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటూ, నాగార్జున కూడా నటించబోతున్నాడనీ తెలుస్తోంది.

అయితే, నాగార్జునది ఫుల్ లెంగ్త్ రోల్ కాదనీ, ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ అనీ తెలుస్తోంది. గెస్ట్ రోలే అయినప్పటికీ కథకు చాలా కీలకంగా వుండబోతోందట ఆ రోల్. అక్కినేని అభిమానుల్ని అలరించేలా ఈ సినిమా వుండబోతోందనీ అంటున్నారు.

గతంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి ‘మనం’ సినిమాలో నటించారు. ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీకి లైఫ్ టైమ్ సక్సెస్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే తాజా మూవీ కూడా వుండబోతోందా.? అని తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే మరి.