మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లో ఆ స్టార్ హీరో.?

‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ప్రచారంలో వున్న సంగతి తెలిసిందే. సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

ముల్లోకాల చుట్టూ తిరిగే ఓ సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఓ పాప పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమైనది.! కాగా, ఈ సినిమా కోసం ఏకంగా ఐదుగురు అందాల భామల్ని ఎంపిక చేయనున్నారట.. అనేది లేటెస్ట్ ఖబర్. ఇందులో నిజమెంతన్నది తేలాల్సి వుంది.

అలాగే, ఈ సినిమాలో విలన్‌గా రాణా దగ్గుబాటి నటించబోతున్నాడన్న ఇంకో గాసిప్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇవన్నీ ఇలా వుంటే, మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.. సర్క్యులేట్ అవుతోంది.

చాలాకాలంగా చిరంజీవి – నాగార్జున కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా, వశిష్ట ఈ సినిమా కోసం నాగార్జునతో సంప్రదింపులు జరిపాడట. ‘విశ్వంభర’లో కొన్ని నిమిషాల పాటు కనిపించే ఓ కీలక పాత్రలో నాగార్జున అయితే బావుంటుందన్నది వశిష్ట ఆలోచన అట.

నిప్పు లేకుండానే పొగ పుడుతుందా.? అన్నట్టు, ఈ గాసిప్ ఊరకనే పుట్టుకొచ్చేసిందా.? విషయం ఏమైనా వుందా.? ముందైతే, సినిమా సెట్స్ మీదకు వెళ్ళాలి. ఒకవేళ నాగార్జున అవసరం వుంటే, చిరంజీవి చాలా తేలిగ్గా నాగార్జునని ఒప్పించేయగలరు.