బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. నాగార్జున హోస్ట్‌గా మంచి రేటింగ్ దూసుకుపోతున్న ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు మరిన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దసరా సందర్భంగా నాగార్జున కోడలు పిల్ల సమంత మూడు గంటల పాటు బిగ్ బాస్ స్టేజ్‌పై నుండి మారథాన్ వినోదాన్ని అందించింది. వైల్డ్ డాష్ షూటింగ్ కోసం నాగార్జున మనాలీలో ఉన్న నేపథ్యంలో సమంత హోస్ట్ భాద్యతలను తన భుజాలపై వేసుకొని కార్యక్రమాన్ని సరదాగా నడిపించింది.
మనాలీ షెడ్యూల్ 21 రోజుల పాటు ఉంటుందని నాగార్జున ఓ వీడియో ద్వారా తెలియజేయగా, ఆయన మరో రెండు వారాలు అక్కడే ఉండనున్నట్టు తెలుస్తుంది. మరి నాగార్జున లేని పక్షంలో ఈ వీకెండ్ బిగ్ బాస్ సీజన్4కు హోస్ట్‌గా సమంతనే వస్తుందా లేదంటే మరెవరైన సెలబ్రిటీని తీసుకొస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాలసమాచారం ప్రకారం ఈ శుక్రవారం నాగార్జున మనాలీ నుండి హైదరాబాద్ రాబోతున్నాడు. గత వారం ఆయన రావలసి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో సమంత టేకప్ చేసింది.
మనాలీ ఇక్కడికి పెద్ద దూరం ఏమి కానందున నాగార్జున తన ప్రోగ్రాంని షెడ్యూల్ చేసుకొని శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారట. శని, ఆదివారాలకు సంబంధించిన షూటింగ్ పూర్తైన వెంటనే ఆయన తిరిగి మనాలీకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అంటే రానున్న వారాలకి గాను నాగార్జుననే హోస్ట్‌గా కనిపించనున్నారని అర్ధమవుతుంది. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 11 మంది ఇంటి సభ్యులు ఉండగా, వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. నామినేషన్‌లో ప్రస్తుతం మెహబూబ్, అఖిల్, లాస్య, మోనాల్, అమ్మ రాజశేఖర్, అరియానా ఉన్నారు.