Big Boss Nonstop: మరొకసారి నోరుపారేసుకున్న శివ

Big Boss Nonstop: తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో ఓటిటి లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ 9 వారాలు పూర్తి చేసుకున్న రియాలిటీ షో ప్రస్తుతం ఫినాలే ఎపిసోడ్ కి దగ్గర పడుతోంది. దీంతో కంటెస్టెంట్ ల మధ్య ఆట చాలా రసవత్తరంగా ఉంది. ప్రతి ఒక్కరూ టైటిల్ గెలవాలనే ఉద్దేశంతో ఒకరితో ఒకరికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా అప్పుడప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కొన్ని సార్లు డర్టీ లాంగ్వేజ్ వాడిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే యాంకర్ శివ ఇలా ఎన్నో సార్లు తన నోటి దురుసు కారణంగా వివాదాల్లో నిలిచాడు. అప్పుడు సరయుతో మాట్లాడిన మాటలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే.

మరి ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడటం కోసం ఆషూ రెడ్డితో శివ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా యాంకర్ శివ లేడీ గెటప్ వేయాల్సి ఉంది. అయితే లేడీ గెటప్ వేయటం కోసం శివ ఆషూ రెడ్డిని లోదుస్తులు అడిగి పదే పదే బట్టలు విప్పి చూపించు అని అనటంతో శివ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నాడు. దీని కారణంగా బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఆడ వారందరిని కన్ఫెక్షన్ రూమ్ లోకి గెలిపించి శివ మాట్లాడిన మాటల గురించి వారి అభిప్రాయం తెలుసుకున్నాడు.

ఐతే అక్కడున్న వారందరూ శివ మాట్లాడింది తప్పు అని చెప్పిన.. అరియన మాత్రం శివది తప్పని ఒప్పుకోలేదు. తర్వాత నాగార్జున జరిగింది మొత్తం వీడియో చూపించగా అప్పుడు ఒప్పుకుంది. ఇలాగే హౌస్ లో ఉన్న మేల్ కంటెస్టెంట్ అందరిని నాగార్జునకన్ఫెక్షన్ రూమ్ లోకి పిలిపించి వారి అభిప్రాయం కూడా తెలుసుకున్నాడు. అప్పుడు అందరూ శివ మాట్లాడిందని తప్పు అని చెప్పగా బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం శివ మాట్లాడినది తప్పని ఒప్పుకోలేదు. శివ ఇలా మాట్లాడినప్పుడు ఆషూ రెడ్డి కొంచెం సీరియస్ అయి ఉంటే సరిపోయేది అని చెప్పాడు. దీంతో నాగార్జున ఇంటి సభ్యులు అందరు ముందు శివ మాట్లాడింది తప్పు అని చెప్పి మందలించాడు. అప్పుడు శివ మాట్లాడుతూ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని చెప్పి ఆషూ రెడ్డికి క్షమాపణలు చెప్పాడు.