మెగా వార్ కి నాగార్జున రెడీ అంటున్నాడా? అందుకే ఈ డేట్ లో..?

టాలీవుడ్ లో జగమెరిగిన సత్యం నలుగురు స్టార్ హీరోలు వారి ఫామిలీ నుంచి వస్తున్న హీరోలు అధికంగా ఉన్నారని. వారి వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ట్రెండ్ లో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. మరి ఇప్పుడు అక్కినేని నాగార్జున తన వారసులు రాణిస్తుండగా ఎలా చూసుకున్నా సరే ఈ నాలుగు టాప్ ఫ్యామిలీస్ లో మొదటి స్థానంలో ఉండేది మెగా ఫ్యామిలీ అనే చెప్పాలి.

బయాస్డ్ గా కాకుండా ఆయా ఫ్యామిలీలో ఉన్న హీరోలు వారి క్రేజ్ మరియు బాక్సాఫీస్ వసూళ్లు పరంగా చూస్తే మెగా ఫ్యామిలీ హీరోలు ముందు ఉంటారు. ఇక అందులో మెగాస్టార్ క్రేజ్ అయితే ఇంకా తగ్గలేదు. తన సినిమాకి ఎలా లేదన్న 50 కోట్లు మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి.

మరి ఇప్పుడు మెగాస్టార్ తోనే మెగా వార్ కి సిద్ధం అన్నట్టుగా కింగ్ నాగ్ పచ్చ జెండా ఊపారు. తాను నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఘోస్ట్” నుంచి నిన్ననే ఈ అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి ఇది దసరా సీజన్ కాగా ఈ సీజన్లోనే మెగాస్టార్ అవైటెడ్ సినిమా “గాడ్ ఫాదర్” కూడా రిలీజ్ కానుంది.

మరి ఈ సినిమా రిలీజ్ తో ఆ సినిమా కూడా పోటీకి దించినట్టే అని చెప్పాలి. మరి ఈ ఇద్దరి మధ్య వార్ అయితే ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిందే. ఇప్పుడు నాగ్ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.