సమంత, నాగార్జున.. అక్కడ కలవబోతున్నారా.?

అక్కినేని నాగార్జునని, ‘మామా’ అని ఆప్యాయంగా పిలిచేది సమంత. అక్కినేని నాగచైతన్యకి సమంత భార్యగా వున్నంత కాలమే సుమీ.! ‘కోడలు పిల్లా..’ అని అంతే ఆప్యాయంగా సమంతని నాగార్జున పిలుచుకునేవాడు.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కొన్నాళ్ళ క్రితం బిగ్ బాస్ వేదికపై, నాగార్జునకి బదులుగా సమంత హోస్ట్ చేసింది.. రెండ్రోజులు. మళ్ళీ అలాంటి సందర్భాన్ని చూడబోతున్నామా.? ఔననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. నాగార్జునే హోస్ట్‌గా వుండబోతున్నారు. కానీ, బిగ్ బాస్ అభిమానులేమో, ‘నాగార్జునా.. నువ్వైతే వద్దు బాబోయ్..’ అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్న ఛేంజ్.. సమంత ద్వారా తీసుకురావాలని నిర్వాహకులు అనుకుంటున్నారట.

ఒక్కసారి కాదు, ఓ రెండు మూడు వీకెండ్స్.. అవీ స్పెషల్‌గా సమంతతో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, సమంత.. ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తారన్నది ప్రస్తుతం వినిపిస్తోన్న ఊహాగానాల సారాంశం.