నాగార్జున స్టార్ట్ చేయాల్సిన టైమ్ వచ్చింది!

అక్కినేని నాగార్జున పర్ఫెక్ట్ సక్సెస్ చూసి చాలా ఏళ్ళయింది. ఆయన నటించిన చివరి మూవీ ‘ది ఘోస్ట్’ దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత చాలా రకాల కథలు విన్న నాగ్ మొత్తానికి రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడు. ఇన్నాళ్లు కథలు అందించిన ప్రసన్న కుమార్ మొదటిసారి నాగ్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండడం విశేషం.

అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా ఫినిష్ అయ్యింది. గత నాలుగైదు నెలలుగా ఎన్నో చర్చలు జరిపి బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న ప్రసన్న కుమార్ మొత్తానికి ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. నాగార్జున ఫీడ్ బ్యాక్ తీసుకున్న ప్రసన్న కుమార్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.

ఇక లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై రెండవ వారం తరువాత స్టార్ట్ కానుందట. సినిమా లాంచ్ పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని సిద్ధమవుతున్నాడు. అసలే అక్కినేని హీరోలు ముగ్గురు కూడా వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కోవడం వలన అక్కినేని ఫ్యాన్స్ చాలా నిరాశతో వున్నారు. మరి నాగార్జున ప్రసన్న కుమార్ తో చేయబోయే సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.