సన్నిహితుడినే ఎదవ అంటూ తిట్టిపోసిన నాగబాబు.. వైరల్ అవుతున్న పోస్ట్!

మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు జనసేన పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు.గత కొద్ది రోజుల నుంచి నాగబాబు జనసేన పార్టీ గురించి కీలక బాధ్యతలు తీసుకోవడమే కాకుండా పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇలా ఒక వైపు రాజకీయాలలోనూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండి నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ఈయన తన ఫ్యామిలీ గురించి ఎవరైనా విమర్శలు చేసిన వెంటనే స్పందిస్తూ తమదైన శైలిలో వారికి కౌంటర్ వేస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని తాజాగా ఈయన చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నేను సాధారణంగా మనుషులను వదిలేయడానికి ఇష్టపడను. ఒకసారి వదిలేశానంటే వాడు పెద్ద ఎదవ అయ్యి ఉంటాడు అంటూ పోస్ట్ పెట్టారు.

ఈ విధంగా నాగబాబు తన సన్నిహితులలో ఒకరిని వదిలిపెట్టాడని పరోక్షంగా తన సన్నిహితుల గురించి ఈ పోస్ట్ చేశారు. అయితే నాగబాబు నుంచి దూరంగా వెళ్లిన ఆ సన్నిహితుడు ఎవరు ఆ పెద్ద ఎదవ ఎవరు అనే విషయం గురించి నేటిజన్ లు ఆరాతీస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగబాబు ప్రస్తుతం కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే