మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మను మించిపోతోన్నాడు. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఏం మాట్లాడుతాడో తెలియకుండా పోతోంది. తాజాగా నాగబాబు వాల్మీకి మీద పడ్డాడు. వాల్మీకి మీదనే శ్రద్ద పెట్టాడా? అంటే లేదు అందులో చాలా విషయాలనే గెలికాడు. అందులో మళ్లీ రాముడిని కూడా లాగాడు.
అసలు నాగబాబు వాల్మీకి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే.. వరుణ్ తేజ్ సినిమా విషయంలో ఓ గొడవ జరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. గద్దలకొండ గణేష్ కంటే ముందు ఆ సినిమా పేరు వాల్మీకి. కానీ మనోభవాలు దెబ్బతింటున్నాయని కొందరు గొడవలు చేయడంతో సినిమా పేరును మార్చేశాడు. నేడు వాల్మీకి జయంతి అట. ఆ నాడు గొడవ చేసిన వారందరినీ ఉద్దేశిస్తూ నాగాబాబు ఓ ట్వీట్ చేశాడు.
‘ఆరోజు “వాల్మీకి” అని టైటిల్ పెడితే గొడవ చేసిశారు కదా. వాళ్ళకి మరి ఈరోజు వాల్మీకి జయంతి అని గుర్తు ఉండేవుంటుంది. Anyways హ్యాపీ బర్త్డే “వాల్మీకి” గారు. నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు . రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదములు….’ అంటూ నాగబాబు గెలికాడు. ఇందులో వాల్మీకిని మాస్ రైటర్ అనడం.. రాముడి జీవితాన్ని కథ అనడం ఇలా చాలా వాటిపైనే నాగబాబు కామెంట్స్ చేశాడు. ఇది చాలా పెద్ద గొడవే అయ్యేలా కనిపిస్తోంది.