Nagababu: పుష్ప 2 టార్గెట్ మరోసారి అల్లు మెగా అభిమానుల మధ్య మంట పెట్టిన నాగబాబు!

Nagababu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఈ సినిమాకి రాజకీయ రంగు పూస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ గతంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడు శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లారు. ఇలా వైకాపా నాయకుడి కోసం అల్లు అర్జున్ వెళ్లడంతో అప్పటినుంచి అల్లు అర్జున్ ను మెగా కుటుంబం దూరం పెడుతూ వస్తోంది.

ఇలా రాజకీయాల పరంగా కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలకు మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి ఈయన ఎక్కడ అల్లు అర్జున్ పేరును ప్రస్తావించకపోయిన పరోక్షంగా ఈయన చేసిన ట్వీట్ మాత్రం అల్లు అర్జున్ ఉద్దేశించే చేశారని తెలుస్తోంది.

గతంలో కూడా అల్లు అర్జున్ గురించి నాగబాబు స్పందిస్తూ మావాడు అయిన పరాయి వాడే అంటూ ఒక పోస్ట్ చేశారు అయితే ఈ పోస్ట్ పై భారీగా విమర్శలు రావడంతో ఆయన డిలీట్ చేశారు. తాజాగా మరోసారి స్వామి వివేకానంద చెప్పిన ఓ కొటేషన్ కి సంబంధించిన పోస్ట్ చేశారు. మీరు ఎంచుకున్న మార్గం తప్పు. అయితే మీరు వెంటనే దానిని సరిదిద్దుకోండి లేకపోతే తిరిగి మీ మూలాలను కలుసుకోవడం చాలా కష్టం అంటూ ఈయన పోస్ట్ చేశారు.

ఇక ఈ పోస్ట్ తప్పనిసరిగా అల్లు అర్జున్ ని ఉద్దేశించే చేశారని తెలుస్తుంది. ఇప్పటికైనా అల్లు అర్జున్ తప్పు తెలుసుకొని తమ ఫ్యామిలీ దగ్గరకు రావాలని లేకపోతే తిరిగి మా దగ్గరకు రావడం ఎంతో కష్టం అనే విధంగా ఈయన పోస్ట్ చేయడంతో అసలు మీ మూలాలు ఎక్కడున్నాయి అల్లు రామలింగయ్య గారు లేకపోతే నాగబాబు అనే వ్యక్తి ఎవరు అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టు పై కామెంట్లు చేస్తున్నారు. ఇక బన్నీ ఫాన్స్ కి కౌంటర్ గా మెగా ఫాన్స్ కూడా కామెంట్లు చేయడంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి ఇద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది.