ఈ సారి హిట్ పక్కా.. నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్ వైరల్

Naga Shaurya Lakshya Teaser out

యంగ్ హీరో నాగ శౌర్య ఓ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందుకోసం రకరకాల పాత్రలను, కథలను ఓకే చేస్తున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లోపెట్టేశాడు. ప్రస్తుతం నాగశౌర్య స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. లక్ష్య అంటూ వదిలిన సినిమా పోస్టర్లు ఇప్పటికే కాక రేపాయి. ఇక మళ్లీ ఓ లవ్ స్టోరీని చేసేందుకు రెడీ అయ్యాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా రాబోతోన్న వరుడు కావలెను చిత్రంతో నాగ శౌర్య ఈ సారి మ్యాజిక్ చేసేలానే కనిపిస్తున్నాడు.

Naga Shaurya Lakshya Teaser out

నేడు (జనవరి 22) నాగ శౌర్య బర్త్ డే. ఈ సందర్భంగా తన కొత్త సినిమాల నుంచి సర్ ప్రైజ్‌లు వచ్చాయి. వరుడు కావలెను నుంచి నాగ శౌర్య ఇంట్రడక్షన్ వీడియో వచ్చింది. అది ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అయితే తాజాగా లక్ష్య టీజర్ వచ్చేసింది. ఆ టీజర్‌ను గమనిస్తే ఈ సారి మాత్రం హిట్ పక్కా అనేలానే ఉంది. నాగ శౌర్య లుక్, డిఫరెంట్ గెటప్స్, జగపతి బాబు డైలాగ్స్, ఆ సీన్స్ అన్నీ కూడా ప్రామిసింగ్‌గానే అనిపిస్తున్నాయి. మొత్తానికి లక్ష్యతో మళ్లీ సూపర్ హిట్ కొట్టేలానే ఉన్నాడు.

కొందరికి ఆటతో గుర్తింపు వస్తుంది.. కానీ ఒక్కడి వల్ల ఆటకే గుర్తింపు వస్తుందని జగపతి బాబు చెప్పే డైలాగ్.. నాగ శౌర్య ఇంట్రడక్షన్ అదిరిపోయింది. టెన్ ప్యాక్స్, గుబురు గడ్డం లుక్‌లొ నాగ శౌర్య అదరగొట్టేశాడు. మళ్లీ మామూలుగా క్లీన్ షేవ్ పాత్రలోనూ దుమ్ములేపాడు. మొత్తానికి యాక్షన్ సీక్వెన్స్‌లో మాత్రం ఇరగ్గొట్టేశాడు. చిన్న టీజర్‌లో వావ్ అనిపించే ఎన్నో సీన్స్ ఉన్నాయి. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.