ఆ మాట చెప్పటానికి నేను సిగ్గిపడను : నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇటీవల లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మనం సినిమా ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన థాంక్యు సినిమాలో నాగచైతన్య మూడు షేడ్స్‌లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకులకు రానుంది.

ఈ క్రమంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే నాగచైతన్య, రాశి ఖన్నా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా థాంక్యూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ.. వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చేయటానికి ఇక్కడి ప్రేక్షకులే కారణం. ఇక్కడి ప్రేక్షకులకు థాంక్యూ చెప్పటానికి ఇక్కడ ఈ ఈవెంట్ చేస్తున్నాము. ఇక్కడి అభిమానులకు ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. మన జీవితంలో మనం ఎవరికైనా థాంక్యూ చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఆ విషయం గురించి అసలు సిగ్గు పడకూడదు అంటూ వెల్లడించాడు.

అయితే నాగచైతన్య కి వైజాగ్ ప్రాంతంతో, ఇక్కడి అభిమానులతో చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. థాంక్యూ సినిమా లో మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే చేరిన గమ్యానికి విలువ ఉండదు అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తొచ్చినప్పుడు నాకు వైజాగ్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే నా సక్సెస్ స్టోరి ముఖ్య కారణం వైజాగ్‌. వైజాగ్‌లో షూటింగ్ చేసిన నా ప్రతీ సినిమా నాకు కమర్షియల్ సక్సెస్ ఇవ్వటంతో పాటు హీరోగా నెక్ట్స్ స్టెప్‌కి తీసుకెళ్లింది అంటూ నాగ చైతన్య వెల్లడించాడు. ఈ సినిమా విషయంలో ముఖ్యంగా నేను దిల్ రాజు గారికి ఫస్ట్ థాంక్యూ చెప్పాలి. ఈ సినిమా కోసం కష్టపడి పని చేసిన అందరికీ నా థ్యాంక్స్ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.