Naga Chaitanya : వెంకట్ ప్రభుతో ఎన్ సి 22…ద్విభాషా చిత్రంగా చైతు మూవీ…!

Naga Chaitanya : ఈ ఏడాది చైతూ వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు. బంగార్రాజు తో సంక్రాంతి కి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య.ఇక ఇపుడు పాన్ ఇండియా సినిమా లాల్ సింగ్ చద్దా తో సిద్ధమయ్యడు.అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చద్దా లో చైతూ కూడా నటించాడు. ఈ సినిమా ఆగష్టు లో ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఇక మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో థాంక్యూ సినిమా లో నటిస్తున్నాడు చైతు. ఈ సినిమా లో నాగ చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది.

ఇక నాగచైతన్య తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో సినిమా చేయనున్నారు. వెంకట్ ప్రభు ఇటీవలే శింబు తో మన్నాడు సినిమా తీసి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈయన దర్శకత్వంలో ఇపుడు చైతూ చేయబోతున్నారు. మన్నాడు రీమేక్ లో చైతూ నటించబోతున్నాడు అని అందరు భావించిన కొత్త కథ తో రాబోతున్నారనే విషయాన్నీ దర్శకుడు స్పష్టం చేశారు.

ఇక ఈ సినిమా తమిళ తెలుగు భాషలలో రూపొందిస్తారట.ప్రస్తుతం అందరు యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలపై మక్కువ చూపుతుంటే చైతూ మాత్రం లోకల్ గా మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు అంతే కాకుండా పక్క రాష్ట్రాల్లో మార్కెట్ ను పెంచుకునే ఆలోచనలో ఉన్నాడు.చైతూ 22 వ సినిమాగా రానున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. చైతుకి తమిళంలో మొదటి సినిమా కావడంతో వెంకట్ ప్రభు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిచ్ గా సినిమా ను తీయాలనీ భావిస్తున్నారట. టాప్ టెక్నిషియన్స్ ను రంగంలోకి దించుతున్నారట ప్రభు. మరి చైతు తమిళంలో ను సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి..