రీసెంట్ గా శోభిత దూళిపాళ ని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన నాగచైతన్య ఈమధ్య రానా ది టాక్ షోలో తెగ సందడి చేశాడు. మామూలుగా ఇంట్రొవెర్ట్ అయిన నాగచైతన్య ఈ షోలో మాత్రం ఫుల్ గా రాణా పై కౌంటర్లు వేశాడు. ఈ షోలో నాగచైతన్య, రానాతో పాటు రానా వైఫ్ మిహిక, అతని సోదరి మాళవిక, రానా కజిన్ సుమంత్ కూడా పాల్గొన్నారు.
ఈ షోలో నాగచైతన్య రానా పై వేసిన కౌంటర్లు అందరినీ తెగ నవ్వించాయి. నువ్వు ఎందుకు మా అందరితో కలవవు, మేము అంతా కలిసి జాం జాం అని పార్టీలు చేసుకుంటాం అని రాణా వేసిన ప్రశ్నకి పార్టీలు చేసుకుని ఏం పీకుతున్నావ్ రా అని చైతన్య అనటంలో షోలో నవ్వులు పూసాయి. 50 ఏళ్ల తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ ఎలా చూసుకుంటావు అని చైతన్యని ప్రశ్నించగా ఒక కంప్లీట్ ఫ్యామిలీ మెన్ లా,పిల్లలతో సరదాగా ఉంటాను అన్నాడు చైతన్య.
వెంకీ మామలా నలుగురు పిల్లలు కావాలా అని రాణా అడిగితే వెంకీ మామది పెద్ద ఫ్యామిలీ, నాకు అలా కాదు ఇద్దరు పిల్లలు చాలు. కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్ కి తీసుకువెళ్తాను, కూతురు పుడితే తనకున్న హాబీలని గుర్తించి ప్రోత్సహిస్తాను వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతాను. చిన్నప్పుడు పిల్లలుగా మనం ఎంజాయ్ చేసిన అక్షరాలని మళ్ళీ వాళ్లతో కలిసి ఆస్వాదించాలని ఉంది అని తెలిపాడు చైతన్య.
ఇక తను నటిస్తున్న తండేల్ సినిమా గురించి మాట్లాడుతూ ఇది నిజమైన స్టోరీ, షూటింగ్ ప్రాసెస్ కూడా చాలా కష్టం అలాగే సాయి పల్లవి తో నటించడం అన్నా, డాన్స్ చేయటం అన్నా టెన్షన్ వచ్చేస్తోంది. ఏదైనా సీన్ సరిగ్గా రాకపోతే మానిటర్లో చూసి వెంటనే బాగోలేదని చెప్పేస్తుంది అని చెప్పాడు నాగచైతన్య. దూత వెబ్ సిరీస్ లో చేసినప్పుడు చాలా డేర్ చేసి నిర్ణయం తీసుకున్నాను ఇకపై ఖచ్చితంగా ఆరు నెలలు వెబ్ సిరీస్ లు చేస్తాను అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య.