ఓటిటిలో నాగ చైతన్య “థాంక్ యూ” డీల్ లాక్..రెండు సంస్థలకి అట.!

అక్కినేని యంగ్ హీరో నవ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “థాంక్ యూ” ఈరోజే థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో నాగ చైతన్య చేసిన మరో సినిమా ఇది కావడంతో మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొనగా మంచి టాక్ కూడా ప్రీమియర్ షోస్ నుంచి ఈ సినిమాపై బయటకి వచ్చింది.

ఇంకా ఇదిలా ఉండగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తరువాత అయ్యే ఓటిటి రిలీజ్ పై ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం అయితే ఈ సినిమాని రెండు స్ట్రీమింగ్ యాప్స్ వారు సొంతం చేసుకున్నారట. మరి అవి ఒకటి సన్ నెక్స్ట్ కాగా మరొకటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమేజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారట.

మరి మరికొన్ని వారాల తర్వాత అయితే ఈ సినిమా ఫలితాన్ని బట్టి స్ట్రీమింగ్ కి రానుంది అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా మాళవిక నాయర్ మరియు యంగ్ హీరోయిన్ అవికా గోర్ లు మరో హీరోయిన్స్ గా నటించారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి కథ బి వి ఎస్ రవి అందించాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించారు.