అక్కినేని కుటుంబానికి ఎందుకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున వారసులైన నాగ చైతన్యకీ, అఖిల్‌కి ఎందుకు సరైన హిట్లు పడడం లేదు.? నాగార్జున తలచుకుంటే పాపులర్ డైరెక్టర్లను క్యూలో నిలబెట్టగలడు తన పిల్లల కోసం.
అంతెందుకు.! జక్కన్న రాజమౌళి సైతం రాగలడు. అలాంటిది ఎందుకు రావడం లేదు.? ఈ ప్రశ్నలు తాజాగా నాగ చైతన్య ముందుకొచ్చాయి. అందుకు సమాధానంగా చైతూ చేసిన వ్యాఖ్యలు నాగార్జున ఫ్యాన్స్‌ని హర్ట్ చేసేలా వున్నాయ్.
‘నాన్న మాకెప్పుడూ అండగా వుంటాడు కానీ, మా కాళ్ల మీద మేం నిలబడాలి కాబట్టి.. ఇలా జరుగుతోంది..’ అని తమ సినిమాల నిర్ణయం నాగార్జునకు సంబంధం లేదనీ, వారి కెరీర్ బిల్డప్ వెనక నాగార్జున పాత్ర ఏమీ లేదనీ చైతూ తేల్చేసినట్లయ్యింది.
నిజానికి చైతూ సినిమాకి కానీ, అఖిల్ సినిమాకి కానీ నాగార్జునే వెనకుండి అంతా నడిపిస్తుంటాడు. ప్రమోషన్స్‌లోనూ నాగార్జునే సర్వం చూసుకుంటాడు. అలాంటిది తాజాగా చైతూ చేసిన వ్యాఖ్యలు వుద్దేశ్యం ఏదైనా కానీ, నాగార్జున ఫ్యాన్స్‌ని హర్ట్ చేస్తున్నాయట. సోషల్ మీడియాలో ఈ విషయంపై హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది.