వైరల్ : సమంతతో విడాకుల కారణం రివీల్ చేసిన నాగ చైతన్య.!

టాలీవుడ్ లో చాలా మందికి ఎంతో ఇష్టమైన మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో యువ జంట సమంత మరియు యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య లు పెయిర్ కూడా ఒకటి. అయితే ఎన్నో ఏళ్ళు వీరు ఎంతో ఆనందంగా ఉండి సడెన్ గా విడాకులు అనౌన్స్ చేయడం అందరికీ షాకింగ్ గా మారింది.

ఫ్యాన్స్ కి అయితే హృదయం ముక్కలయిపోయింది. కానీ ఫైనల్ గా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. చెయ్యడానికి ఏమీ లేదని ఊరుకున్నారు. తర్వాత కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆల్ ది బెస్ట్ లాంటి కామెంట్స్ చేసుకోవడం బాగానే ఉంది. కానీ తర్వాత తర్వాత అంతా అతిగా మారిపోయింది.

ఈ విడిపోయిన తర్వాత కూడా నాగ చైతన్య అయితే సమంత కోసం ఎక్కడా చిన్న మాట కూడా జారింది లేదు. ఇక ఇప్పుడు సమంత తో విడాకుల అంశంపై కొన్ని కారణాలు చెప్పడం వైరల్ గా మారింది. మెయిన్ గా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని అంశాల వల్లే తమ మధ్య రిలేషన్ దెబ్బ తింది అని చెప్పాడు.

ఒకరి మీద ఒకరికి గౌరవం లేనట్టుగా బయటకు వెళ్ళింది ఇది నన్ను ఎంతగానో బాధ పెట్టింది అని తెలిపాడు. అయితే సమంత ఎప్పుడూ కూడా హ్యాపీ గా ఉండాలని ఆమె చాలా మంచి మనిషి అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ని ఫ్యాన్స్ లో తీసుకొచ్చింది.