ఆ కండిషన్ తోనే శోభితని పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. అక్కడే ప్రపోజ్ చేశానంటూ కామెంట్స్!

అక్కినేని అందగాడు నాగచైతన్య మొత్తానికి డిసెంబర్ 4న మళ్లీ ఒక ఇంటివాడు అయ్యాడు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుని ఈ మధ్యే కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితుల మధ్య వివాహం చేసుకున్నారు నాగచైతన్య, శోభితల జంట. ఇన్నాళ్లు పెళ్లి పనులతో బిజీగా ఉన్న ఈ జంట ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఈ జంట కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను శోభితకి పెట్టిన కండిషన్స్ గురించి కూడా చెప్పాడు. అదేమిటంటే నాకు చైతన్య తెలుగింటి అబ్బాయి అయినా పుట్టి పెరిగింది మొత్తం చెన్నైలోనే కావటం వలన తమిళం, ఇంగ్లీషు బాగా మాట్లాడతాడట. తెలుగులో మాట్లాడేటప్పటికీ కొన్ని తప్పులు దొర్లుతాయట. సినీ ఇండస్ట్రీ లో వివిధ భాషలకు సంబంధించిన నటీనటులను కలుస్తుండటంతో ఇంగ్లీషు, తెలుగు కలిపి మాట్లాడే వాడట నాగచైతన్య.

అయితే తనకి తెలుగు మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టమని శోభిత తెలుగు అమ్మాయి కావడంతో ఆమెని తనతో తెలుగులోనే మాట్లాడాలని ఆమెని అడిగానని తద్వారా నాకు కూడా తెలుగు బాగా అలవాటు అవుతుంది కదా అని చెప్పానంటూ చెప్పాడు నాగచైతన్య. అలాగే వీళ్ళిద్దరూ తొలిసారి ముంబైలోని ఒక కాఫీ షాప్ లో కలిసినట్లు, వీరిద్దరి ప్రేమ మొదలయ్యాక కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్ కి మొదటిసారిగా వెళ్లారట. అక్కడ చాలా సమయం గడిపి ఒకరి గురించి మరొకరు బాగా తెలుసుకున్నారంట. అలాగే మార్చిలో ఇద్దరు కలిసి లండన్ వెళ్లారట.

ఇటీవల ఆగస్టులో గోవాకి కూడా వెళ్లారట అక్కడే చైతన్య పెళ్లి ప్రపోజల్ చేయడంతో గోవా నుంచి రాగానే వెంటనే నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఇక నాగచైతన్య లేటెస్ట్ సినిమా థండెల్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలని భారీగా పెంచేశాయి ఈసారి నాగచైతన్యకి మంచి హిట్ పడలా ఉంది అని మురిసిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్.