నాగ చైతన్య పెద్ద రిస్క్ చేస్తున్నాడుగా

అక్కినేని యువ హీరో నాగ చైతన్య కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీస్ పై చైతూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఆడియన్స్ కి మాత్రం కనెక్ట్ కాలేదు. ప్రస్తుతం చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేయబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ప్రస్తుతం ఉందంట. మరో వైపు క్యాస్టింగ్ సెలక్షన్ కూడా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుమారు 60 కోట్ల బడ్జెట్ ఈ చిత్రం కోసం అల్లు అరవింద్ ఖర్చు చేయబోతున్నారు . మత్యకారుల బ్యాక్ డ్రాప్ లో శ్రీకాకుళం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక సినిమాకి అన్ని భాషలకి సెట్ అయ్యే విధంగా తండేల్ అనే టైటిల్ ని అనుకుంటున్నారంట.

ఈచిత్రం తర్వాత నాగ చైతన్య అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కథతో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. సామజవరగమన మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుమ్మ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందంట. ఇప్పటికే దర్శకుడు కథని కూడా నేరేట్ చేయడం జరిగిందని టాక్. అయితే ఈ కథ నేపథ్యం విడాకుల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట.

ఈ కారణంగా దర్శకుడికి కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. సమంతతో చైతూ విడాకుల తర్వాత అతనిపై సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు విడాకుల కాన్సెప్ట్ తోనే మూవీ అంటే కొంత రిస్క్ ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కథలో కొన్ని మార్పులు చెప్పాడంట.

ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ మార్పులు చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. చందూ మొండేటి మూవీ కంప్లీట్ కావడానికి ఎలాగూ టైమ్ పడుతుంది కాబట్టి ఈ లోపు మంచి ఫన్ రైడ్ గా కథని సిద్ధం చేసే పనిలో రామ్ అబ్బరాజు ఉన్నారంట.