Naga Chaitanya : నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు… ఈసారి నిర్ణయం ఎవరిదో తెలుసా…!

Naga Chaitanya : నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .ఆ తరువాత కారణాలు ఏవైనా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.ఇక విడాకుల తర్వాత వాళ్ళు ఎందుకు విడిపోతున్నారో కారణాలు చెప్పకుండా ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకున్నారు. ఇక మీడియాలో మొత్తం ఈ వార్తలతో నిండిపోయింది.

ఇక ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీ అయిపోయారు. సమంత పుష్ప లో ఐటమ్ సాంగ్ తో ఇటు సౌత్, అటు నార్త్ లో కూడా బాగా పాపులర్ అయింది. ఇక చైతు కూడా సంక్రాంతికి బంగార్రాజు గా వచ్చి హిట్ కొట్టాడు. ఇక బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్ధ లో నటించాడు. ఈ సినిమా ఆగష్టు లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక తమిళ దర్శకుడు వెంకట్ ప్రభూతో కలిసి ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక చైతూ ఇపుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో లో తెగ వైరల్ అవుతోంది ఈ విషయం. ఇక చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ని ఎంపిక చేసింది నాగార్జున అని వినిపిస్తోంది. మొదటి పెళ్లి ఫెయిల్ అవ్వడంతో ఇక రెండో పెళ్లి విషయంలో పూర్తిగా నిర్ణయం తండ్రికి వదిలేశారట. ఇక నాగచైతన్య నాన్నమ్మ అన్నపూర్ణమ్మ గారి పుట్టింటికి సంబంధించిన అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నారట.ఇక ఆ అమ్మాయి చెల్లిని వీలైతే అఖిల్ కి ఇచ్చి ఇద్దరి వివాహం ఒకేసారి జరిపించాలని అనుకుంటున్నారట నాగార్జున.