పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న నాగచైతన్య దంపతులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మిహిక!

అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ల చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకొని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. రెండు సంవత్సరాలుగా ప్రేమ పక్షులుగా ఉన్న వీరు ఇప్పుడు భార్యాభర్తలు ప్రమోషన్ కొట్టేశారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో 8: 13 నిమిషాలకి చైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఈ వివాహానికి అటు అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబంతోపాటు శోభిత కుటుంబ సభ్యులు ఇంకా అతి కొద్దిమంది శ్రేయోభిలాషులు మాత్రమే హాజరయ్యారు.

తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా జరిగిన వీరి వివాహంలో ప్రతీ ఘటన శోభాయమానమే. సాంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన వధూవరులని చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. పట్టు పంచలో నాగచైతన్య మెరిసిపోయాడు, కాంజీవరం చీరలో శోభిత దేవతల కనిపించింది. వారి వంశపారంపర్యంగా వస్తున్న నగలను ధరించింది. ఆమె ధరించిన ముక్కుపుడక ఆమెకు ప్రత్యేక వన్నె తీసుకొచ్చింది.

కొడుకు పెళ్లి చూసి బాగా ఎమోషనల్ అయిన నాగార్జున పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మీరు మా జీవితాల్లో ఎంతో ఆనందం తెచ్చారు,అంతకు మించిన సంతోషంతో మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అలాగే దగ్గుబాటి రానా కూడా ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెళ్ళికొడుకు అని టాగ్లైన్ తగిలించాడు. ముందు నుంచే నాగచైతన్య, రాణాల మధ్య మంచి అనుబంధము ఉన్న సంగతి మన అందరికీ తెలిసిదే దాంతో చైతన్య పెళ్లిలో రానా హడావిడి ఎక్కువగా ఉంది.

ఇక రానా భార్య మిహీక కూడ చైతన్య పెళ్ళికి సంబందించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలో అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఇక ఈ నూతన దంపతులను ఆశీర్వదించడానికి మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, మహేష్ బాబు, నమ్రత, అల్లు అర్జున్, టి సుబ్బిరామిరె,డ్డి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అరవింద్, సుహాసిని దంపతులు కూడా హాజరైనట్లు సమాచారం.