సమంత నాగ చైతన్యలు ఇంట్లో ఎలా ఉంటారో ఎవ్వరికీ అంతగా తెలియదు. సినిమాల్లో కనిపించే తీరు వేరు.. నిజ జీవితంలో ఉండే మనుషులు వేరు. అలా సమంత, నాగ చైతన్యలు ఇంట్లో ఎలా ఉంటారన్నది అంతగా తెలియదు. మరీ ముఖ్యంగా నాగ చైతన్య సోషల్ లైఫ్‌కు దూరంగా ఉంటాడు. ఎప్పుడో పండుగలకు, తన సినిమా ఈవెంట్లకు సంబంధించిన పోస్ట్‌లు మరేతర పోస్ట్‌లు కూడా చేయడు. సమంత అయితే రోజుకు కనీసం పది పోస్ట్‌లు చేసినా తక్కువే అవుతుంది.
అయితే ఇదే విషయాన్ని సమంత తన సామ్ జామ్ షోలో చైతన్యను అడిగేసింది. నువ్ ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటావ్.. ఎందుకు అంత యాక్టివ్‌గా ఉండవు అనే విషయాన్ని నీ ఫ్యాన్స్‌కు చెప్పు అని సమంత అడిగేసింది. తన ప్రైవేట్ లైఫ్‌ను పబ్లిక్‌గా ఉంచడం తనకు నచ్చదని, అది తన స్పేప్ అని.. ఎవ్వరికీ చెప్పాల్సిన, చూపించాల్సిన పని లేదు అని నాగ చైతన్య చెప్పాడు. తాను ముందుగానే రిజర్వ్‌డ్ అని అలాంటివి తనకు నచ్చవని నాగ చైతన్య అన్నాడు.
మరి నువ్ ఎందుకు ప్రతీ ఫోటోలను షేర్ చేస్తుంటావ్ అని సమంతను నాగ చైతన్య ప్రశ్నించాడు. తాను ఏంటో చూపించేందుకు అలా చేస్తుంటాను అని సమంత చెప్పింది. తెరపై చూపిస్తున్నావ్ కదా? మళ్లీ ఇక్కడ కూడా ఎందుకు? అని అడిగితే.. అది సమంత కాదు.. ఏదో ఒక క్యారెక్టర్ కదా.. అని సోషల్ మీడియాలో ఉండేది నిజమైన సమంత అంటూ తన వర్షెన్‌ను చెప్పేసింది. సమంత ఏడాదికి సగటున 1040 పోస్ట్‌లు చేస్తే.. చైతన్య మాత్రం 40 పోస్ట్‌లు చేస్తాడట.