బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్!!.. బాలయ్యపై స్వరం మార్చిన నాగబాబు

Naga Babu SHares Old Pic Of Bala Krishna And Pawan Kalyan

నందమూరి బాలకృష్ణకు మెగా బ్రదర్ నాగబాబు మధ్య ఉండే కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో విషయాల్లో బాలయ్యను విమర్శిస్తూ నాగబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. చిరంజీవిని బాలయ్య పరోక్షంగా విమర్శించిన ప్రతీసారి నాగబాబు రివర్స్ కౌంటర్స్ ఇస్తూనే వచ్చాడు. ఇక బాలయ్య ఎవరు? ఆయన ఎవరో తెలీదు అని సెటైర్ వేసే అంత వరకు వెళ్లిపోయాడు నాగబాబు.

Naga Babu SHares Old Pic Of Bala Krishna And Pawan Kalyan
Naga Babu SHares Old Pic Of Bala Krishna And Pawan Kalyan

బాలయ్య అంటే ఒకప్పుడు ఉండే కమెడియన్ కదా? అంటూ నాగబాబు చమత్కరించాడు. మరో సందర్భంలో శివ శంకరీ అనే పాటను బాలయ్య పాడగా.. దానిపైనా కౌంటర్లు వేశాడు. మరీ అవీ తీవ్ర స్థాయిలో ఉండటంతో వాటిని డిలీట్ చేసేశాడనుకోండి అది వేరే విషయం. ఆ మధ్య చిరంజీవి చొరవ తీసుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపడంపైనా బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేస్తూ భూములు పంచుకుంటున్నారేమోనని చిరుపై పరోక్షంగా కామెంట్ చేశారు.

Naga Babu SHares Old Pic Of Bala Krishna And Pawan Kalyan
Naga Babu SHares Old Pic Of Bala Krishna And Pawan Kalyan

 

బాలయ్య కామెంట్లపై నాగబాబు శివాలెత్తిపోయాడు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఆ గొడవ కాస్త సద్దుమణిగిన తరువాత మరో సందర్భంలో బాలయ్య గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్పాడు. తాజాగా పనవ్ కళ్యాణ్, బాలయ్య షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫోటోను షేర్ చేస్తూ అదిరిపోయే కామెంట్ చేశాడు. బాలయ్యను నందమూరి సింహంగా కొనియాడుతూ.. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటూ సోదరభావాన్ని కురిపించాడు. దీంతో సోషల్ మీడియాలో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఆ ఫోటో సుస్వాగతం సినిమా షూటింగ్ ప్రారంభోత్సం నాటిదని తెలుస్తోంది.