కూతుళ్లంటే అలాంటి దెయ్యాలే.. నిహారికపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

Naga babu EMotional On Niharika Konidela ABout Daughters day

ప్రపంచంలో ప్రతీ ఒక్క రోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. ఆ డే ఈ డే అంటూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. అయితే నేడు (సెప్టెంబర్ 27) డాటర్స్ డే అట. అంటే కూతుళ్ల దినోత్సవం. ఇక ఈ డాటర్స్ డే సందర్భంగా నాగబాబు తన కూతురి గురించి వర్ణించాడు. అసలే ఈ మెగా బ్రదర్‌కి తన కూతురు నిహారిక అంటే పంచ ప్రాణాలు. ఆమె ఐదు నిమిషాలు కనిపించకపోయే సరికే ఓ దేశం మొత్తాన్ని నాశనం చేయాలనేంత కోపం వచ్చిందట.

Naga babu EMotional On Niharika Konidela ABout Daughters day
Naga babu EMotional On Niharika Konidela ABout Daughters day

నాగబాబు తన కూతురు మీదున్న ప్రేమను చాటుతూ.. కూతుళ్లంటే.. మనం కలలు కనే చిట్టి దెయ్యాలో కూతుళ్ల రూపంలో ఈ భూమ్మీదకు వస్తారు.. మనల్ని నవ్వించేందుకు, ఏడిపించేందుకు, ఆట పట్టించేందుకు, చిరాకు పుట్టించేందుకు, మొత్తానికి మనల్ని ప్రేమలో పడేసేందుకు మన కోసం వస్తారు అంటూ ఎంతో గొప్పగా చెప్పాడు. వారి పిచ్చిని ప్రతీ రోజూ సెలెబ్రేట్ చేసినా సరిపోదంటూ హ్యాపీ డాటర్స్ డే టు మై డ్రీమ్ డెవిల్.. ఈ భూమ్మీద ఉన్న ప్రతీ దెయ్యానికి కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు అని తెలిపాడు.

Naga babu EMotional On Niharika Konidela ABout Daughters day
Naga babu EMotional On Niharika Konidela ABout Daughters day

మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకుని వెళ్లిపోయేందకు రెడీగా ఉంది. ఈ మేరకు ఆగస్ట్‌లో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ మధ్య తన వియ్యంకుడు ఐజీ అధికారి రిటైర్మెంట్ సందర్భంగా ఎంతో గొప్పగా మాట్లాడాడు. ఇక నిహారిక తనను వదిలి వెళ్లిపోనుందని నాగబాబు బాగానే ఫీలవుతున్నట్టున్నాడు. అందుకే వినాయక చవితికి బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్‌లో అంతగా ఎమోషనల్ అయ్యాడు.