Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే నాగచైతన్యతో విడాకులు ప్రకటన తర్వాత ఈమె తన కెరియర్ లో బిజీగా మారిపోయి వరుస సినిమాలకు కమిట్ అయ్యారు.ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే సమంత ఏం మాయ చేశావే సినిమాతో 2010వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని నటిగా తాను 12 సంవత్సరాలు దిగ్విజయంగా ఇండస్ట్రీలో కొనసాగారు.ఈ క్రమంలోనే తన 12 సంవత్సరాల సినీ కెరియర్ ని పూర్తికావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ చేస్తూ… ఈరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక విషయాన్ని గ్రహించాను. నా 12 సంవత్సరాల సినీ కెరీర్లో, లైట్స్, కెమెరా యాక్షన్ అంటూ సాగిపోయిన ఈ 12 సంవత్సరాలలో ఎంతో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలియజేశారు.
ఈ సినీ ప్రయాణంలో నేను ఎంతో నమ్మకమైన అభిమానులను సంపాదించుకున్న ఈ సినిమాతో నా ప్రేమకథ ఎప్పటికీ అంతం కాదు.ఇకపై ఎప్పుడు కూడా నా ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను అంటూ సమంత తన 12 సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.