టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రియ శరన్ కు మంచి ప్రేక్షక అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సహాయ పాత్రలలో మెప్పిస్తుంది. ఇటీవలే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా అజయ్ దేవగన్ భార్యగా సరోజిని పాత్రలో నటించింది. ఇక తాజాగా శ్రియ కొన్ని విషయాలను పంచుకుంది.
రాజమౌళి సినిమా అనగానే తను ఓకే చెప్పేశాను అని.. కథ ఏమిటి, పాత్ర ఏమిటి, ఇంకా ఎవరెవరు చేస్తున్నారు అనేది ఆయనను అడగలేదంటూ.. కారణం ఆయనపై ఉన్న నమ్మకం అదే అని తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర చిన్నదే అయినా కానీ బాధ పడటం లేదు అంటూ.. కానీ పెద్ద సినిమాలో భాగమైనందుకు సంతోషపడుతున్నానని తెలిపింది. ఇక ఈ సినిమా టికెట్ల కోసం ఇంకా ట్రై చేస్తున్నానని తెలిపింది.