Akhanda 2: అఖండ 2తో ఫ్యాన్స్‌కి అసలైన ఫీస్ట్ గ్యారెంటీ!

Akhanda 2: ‘అఖండ’ సినిమాతో నందమూరి బాలకృష్ణ మరోసారి తన మాస్‌ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అఘోరా పాత్రలో బాలయ్య నటనలో కొత్త ఒరవడి అభిమానులను రక్తికట్టించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం, తమన్ సంగీతం కలగలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. దీంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఎట్టకేలకు ‘అఖండ 2’ అధికారికంగా ప్రారంభమై సెప్టెంబర్ 25 విడుదలకు సిద్ధమవుతోంది.

లేటెస్ట్ గా ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్‌లో తమన్ చేసిన కామెంట్స్‌ హైప్‌ను రెట్టింపు చేశాయి. “ఇంటర్వెల్‌ కే మొత్తం పైసా వసూల్ సీన్స్ ఉంటాయి, అఖండ 2లో అంత కసిగా సీన్‌ను ప్లాన్ చేస్తున్నారని” తెలిపారు. మొదటి భాగంలో ఇంటర్వెల్‌ సీన్‌ ప్రేక్షకులను గూస్‌బంప్స్‌ ఇచ్చేలా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్టాండర్డ్‌ను మించిపోయేలా అఖండ 2లో ఆ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం.

బోయపాటి ఈసారి కుంభమేళా నేపథ్యంతో కథను మలిచారు. పెద్ద బాలయ్యగా కనిపించే అఘోరా చుట్టూ కథ సాగనుందని తెలుస్తోంది. మునుపటి పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్లు, మరింత ఇంటెన్స్ డ్రామా ఉంటుందని టాక్. చిన్న బాలయ్య పాత్రతో పెద్ద నాన్న పాత్రకు మధ్య అనుబంధాన్ని బలంగా చూపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం లొకేషన్ల ఎంపిక జరుగుతుండగా, త్వరలోనే బాలయ్య షూటింగ్‌లో పాల్గొననున్నారు. ‘అఖండ 2’పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, బోయపాటి మరోసారి తన మాస్ మేజిక్ చూపిస్తాడని సినీ పరిశ్రమ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

అఖండ2 తాండవం| Director Geetha Krishna Analysis On Akhanda2 Shooting In Kumbh Mela | Balakrishna | TR