బాలకృష్ణ ఇప్పటికే ప్రతిరోజు ఆ సినిమాలు చూడనిదే నిద్రపోరు: మురళీ మోహన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నందమూరి తారకరామారావు ఒకరు. ప్రేమ కథ చిత్రాలు కుటుంబ కథ చిత్రాలు పౌరాణిక చిత్రాలలో నటించి మెప్పించారు. ఇకపోతే ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి నందమూరి బాలకృష్ణ అడుగుపెట్టారు.బాలకృష్ణ సైతం తండ్రికి ఏమాత్రం తగ్గను అనేలా సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తండ్రి పేరు ప్రఖ్యాతలను నిలబెట్టారు.

ఇక బాలకృష్ణ షూటింగ్ సమయంలోను రోజువారి కార్యక్రమాలలోనూ తన తండ్రిని అనుసరిస్తూ పెరిగారు అందుకే షూటింగ్ సమయంలో ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఎంతో క్రమశిక్షణతో బాలకృష్ణ మెలుగుతారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ బాలకృష్ణ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బాలకృష్ణ గారికి తన తండ్రి అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. ఇప్పటికీ తన తండ్రి పేరు పై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను గౌరవాన్ని చాటుకుంటారని మురళీమోహన్ తెలిపారు.

ఇకపోతే బాలకృష్ణ ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఎన్టీఆర్ సినిమాలు లేదా కనీసం ఆయన పాట వినందే ఆయన నిద్రపోరు. ఇది బాలకృష్ణకు ఒక సెంటిమెంట్ గా ఉండిపోయింది. ఇకపోతే బాలకృష్ణ ప్రతిరోజు కొన్ని వందలసార్లు తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ అక్కడ ఉన్నటువంటి చిత్ర బృందంతో తన తండ్రి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ తన తండ్రిని స్మరించుకుంటూ ఉంటారని మురళీమోహన్ బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.