ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ప్రముఖ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోలకు ఫోజులిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన న్యూడ్ ఫోటోల కోసం ఫోటోషూట్ చేయించుకోవడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదాలకు కూడా కారణమయ్యాయని చెప్పాలి. ఈ విధంగా ఈయన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది మహిళా సంఘాల నేతలు ఈ ఫోటోల పై మండిపడ్డారు.
ఈ క్రమంలోనే రణవీర్ సింగ్ వ్యవహార శైలి పై శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదులో భాగంగా రణవీర్ సింగ్ ఇలాంటి ఫోటోలు షేర్ చేయడంతో మహిళల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా ఈయనని అనుసరిస్తూ మరికొంతమంది ద్వితీయ తృతీయ శ్రేణి నటులు కూడా ఇలాంటి ఫోటోలతో చెలరేగిపోతారని ఇలాంటి వాటిని అడ్డుకట్టు వేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధంగా ఈ సంస్థ అతనిపై ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు.
ఈ క్రమంలోనే ముంబై పోలీసులు ఆగస్టు 22వ తేదీ ఈ న్యూడ్ ఫోటోల విషయంపై రణవీర్ సింగ్ విచారణకు హాజరుకావాలని ముంబై పోలీసులు నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా ఈయన చెప్పే సమాధానాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నట్లు ఇందులో పేర్కొన్నారు. ఇకపోతే స్వయంగా ముంబై పోలీసులు నటుడు రణవీర్ ఇంటికి వెళ్లి ఈ నోటీసులను అందించారు.అయితే పోలీసులు అక్కడికి వెళ్లిన సమయంలో రణవీర్ సింగ్ ఇంట్లో లేకపోవడం గమనార్హం.మరి ఆగస్టు 22వ తేదీ విచారణలో భాగంగా ఈయన ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వనున్నారో తెలియాల్సి ఉంది.