బిగ్ బాస్ హౌజ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ గా గుర్తింపు అందుకున్న కంటెస్టెంట్ అవినాష్. అవినాష్ వైల్డ్ కార్డు ద్వారా హౌజ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు అతను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారి జబర్దస్త్ నుంచి ఒక కమెడియన్ విడుదల కావలి అంటే అగ్రిమెంట్ ప్రకారం భారీ మొత్తంలో చెల్లించాల్సిందేనట.
అయితే దాదాపు 8ఏళ్ళు ఆ షోలోనే కొనసాగుతూ వచ్చిన అవినాష్ సడన్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లస్ కారణంగా అధిక డబ్బు అవసరం పడడంతో బిగ్ బాస్ కు వెళ్లాలని అనుకున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే జబర్దస్త్ వద్ద అనుమతి కోరగా వాళ్ళు 10లక్షల రూపాయలు కట్టేసి NOC తీసుకోవాలని కండిషన్ పెట్టారట.
అయితే ఆ సమయంలో కనీసం వాళ్ళని అప్పుగా డబ్బు అడిగినా కూడా సహాయం చేయలేదని చెప్పిన అవినాష్ గతి లేక అప్పు చేసి కట్టాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక శ్రీ ముఖి, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను వంటి వాళ్ళు హెల్ప్ చేయడం వలన ఆ డబ్బు కట్టేసి బయటకు వచ్చినట్లు చెబుతూ.. ఇక బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ వల్ల ప్రాబ్లస్ అన్ని సెట్టయినట్లు వివరణ ఇచ్చాడు. గతంలో జబర్దస్త్ నుంచే కాకుండా పటాస్ వంటి షోల నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఆ సంస్థపై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
శ్రీ ముఖి యాంకర్ రవి అలాగే నాగబాబు ఆ సంస్థ షోల నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ విధంగా స్పందించారో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు అవినాష్ ఏకంగా 10లక్షలు కట్టి బయటకు వచ్చాడు అని తెలియడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఇంతవరకు ఆ సంస్థ యాజమాన్యం వివరణ ఇచ్చింది లేదు.