వాళ్లకు అసలు బుర్ర పనిచేస్తోందా? : హీరోయిన మృణాల్‌ ఠాకూర్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మార్ఫింగ్‌ వీడియోపై ఒరిజినల్‌ వీడియోలో ఉన్న జరా పటేల్‌ స్పందించారు. జరిగిన దానికి చింతిస్తునట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ చేశారు. జరా పటేల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌. రష్మిక ఇష్యూ గురించి ఆమె ఏమన్నారంటే.. ‘‘డీప్‌ ఫేక్‌ వీడియో టెక్నాలజీతో నా శరీరానికి ప్రముఖ నటి ముఖాన్ని జోడిరచగా వైరల్‌ అయిన వీడియో నా దృష్టికి వచ్చింది.

ఈ విషయంలో నేను చాలా చింతిస్తున్నా. ఇందులో నా ప్రమేయం ఏ మాత్రమూ లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే మహిళలు, చిన్నారుల భవిష్యత్‌ ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. సోషల్‌ విూడియా వేదికగా ఏది పంచుకోవాలన్నా భయంగా ఉంది. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్‌ చేయవద్దు. సోషల్‌ విూడియాలో వచ్చే ప్రతి దాని విషయంలో నిజ నిర్థారణ ఎంతో అవసరం. మనం ఇంటర్‌నెట్‌లో చూసేది ఏదీ నిజం కాదు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో జరా పటేల్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ కూడా వైరల్‌ అవుతోంది.

ఇదే ఘటనపై హీరోయిన మృణాల్‌ ఠాకూర్‌ కూడా స్పందించారు. ‘ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వాళ్లను చూస్తుంటే సిగ్గుగా ఉంది. వాళ్లకు అసలు బుర్ర పనిచేస్తోందా? ఈ ఘటనను ప్రతిఘటిస్తూ గొంతెత్తిన రష్మికకు కృతజ్ఞతలు. మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చాలా మంది మౌనంగా ఉండిపోతారు. రోజూ ఇంటర్నెట్‌లో కొన్ని వందల మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి.

ముఖ్యంగా హీరోయినలకు సంబంధించి వారి శరీర భాగాలను జూమ్‌ చేసి మరీ వీడియోలు తయారు చేస్తున్నారు. అసలీ సమాజం ఎటు పోతుంది? మేమంతా వృత్తిరీత్యా నటులమే కావచ్చు కానీ, మేము కూడా మనుషులమే కదా! మౌనంగా ఉండటానికి ఇది సమయం కాదు’’ అని మృణాల్‌ ఆగ్రహించింది. అయితే ఈ చర్యను ఖండిస్తూ ఇప్పటికే కేంద్ర ఐటీశాఖ నుంచి అమితాబ్‌, నాగచైతన్య, చిన్మయి వరకూ రష్మికకు మద్దతుగా నిలిచారు. నిందితులను శిక్షించాలని కోరారు.