మృనాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ పెంచేసిందట.! ఏం పెంచడంలో వింతేముంది.? స్టార్‌డమ్ అనూహ్యంగా వచ్చేసింది కదా.! కానీ, నిర్మాతలకు అందని స్థాయిలో ఆమె రెమ్యునరేషన్ పెంచేసిందన్న గాసిప్స్.. కాస్త ఇబ్బందికరంగా మారాయామెకి.
ఈ విషయమై మృనాల్ ఠాకూర్, తన మేనేజర్ ద్వారా నిర్మాతలకు సమాచారం ఇస్తోందట. తానేమీ రెమ్యునరేషన్ పెంచెయ్యలేదన్నది ఆ సమాచారం తాలూకు సారాంశం.
ఓ పెద్ద సినిమాలో మృనాల్ ఠాకూర్ పేరు ప్రచారంలోకి రాగా, ‘ఆమెని భరించడం కష్టం..’ అని ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో మృనాల్ స్థానంలో మరో హీరోయిన్ ఎంపిక జరిగిపోవడం.. ఈ విషయం మృనాల్ దృష్టికి వెళ్ళడంతోనే ఆమె జాగ్రత్త పడిందట.
మృనాల్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలున్నాయి. అన్నీ మంచి ప్రాజెక్టులే. ఇవి కాక, మరో నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయి.
స్టార్‌డమ్ వస్తే, రెమ్యునరేషన్ గాసిప్స్ రావడం మామూలేగానీ, మరీ ఇంత దారుణంగానా.? అంటూ మృనాల్ ఠాకూర్ ముక్కున వేలేసుకుంటోందిట. తాను నిర్మాతల ఫ్రెండ్లీ యాక్ట్రెస్.. అని మృనాల్ చెప్పుకుంటోందట.