బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాని తొలుత ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంతమేర మిగిలి ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం పడుతుండటంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.అంతేగాక సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు సినిమాలు సీటు రిజర్వ్ చేసుకోవడంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు.గతంలో ఈ డైరెక్టర్ తెరకెక్కించిన బొమ్మరిల్లు చిత్రం బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే.దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా సూపర్ హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో మరో బ్యూటీ ఈషా రెబ్బా కూడా నటిస్తోంది.మరి ఈ సినిమాతో అయినా అఖిల్ కి అందని ద్రాక్షగా మిగిలిపోయిన హిట్ ని అందుకుంటాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారట. ఎలాంటి హిట్ కొడతాడో తెలియాలంటే మాత్రం వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే ఇక.