వెంకీ ‘రానా నాయుడు’ పార్ట్ – 2: వల్గారిటీ డోస్ ఇంకా పెంచేస్తారట.!

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ అప్పట్లో పెను సంచలనం. వెబ్ సిరీస్‌లో ఆకట్టుకునే కంటెంట్ ఏదన్నా వుందంటే, ఓ సెక్షన్ ‘వల్గర్ లాంగ్వేజ్’ లవర్స్ మెచ్చే వల్గారిటీనే.! అంతకు మించి, అందులో ఇంకేమీ లేదు.

డిజాస్టర్.. అనే విమర్శ దగ్గర్నుంచి, సూపర్బ్ వ్యూస్ అనేదాకా వెళ్ళింది ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్. రానా దగ్గుబాటి మీద పెద్దగా విమర్శలేం రాలేదుగానీ, వెంకటేష్ మాత్రం దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కోవడం చూశాం.

అయితే, అందులోని వల్గారిటీని వెంకటేష్ సమర్థించుకుంటుండడం గమనార్హం. ‘కొందరు బాలేదన్నారు. చాలామంది బావుందన్నారు. యంగ్ ఆడియన్స్ ప్రోత్సహిస్తున్నారు.. అయినా, పెద్దలకు మాత్రమే.. అనే హెచ్చరిక వుంది కదా..’ అంటూ వెంకటేష్ తాజాగా, ‘రానా నాయుడు’పై వ్యాఖ్యానించాడు.

‘రానా నాయుడు’ మొదటి పార్ట్‌ని మించి రెండో పార్ట్ వుండబోతోందని కూడా వెంకీ చెప్పడం గమనార్హం. అంటే, అంతకు మించిన వల్గారిటీని రెండో పార్ట్‌లో చూడబోతున్నామన్నమాట.

వెబ్ సిరీస్‌లంటే ఛండాలంగా వుండాలనే రూల్ ఏమీ లేదు. చాలా వెబ్ సిరీస్‌లు క్లీన్ కంటెంట్‌తో వస్తున్నాయ్. వెంకీ, ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాడో ఏమో.! అన్నట్టు, వెంకీ మేనల్లుడు నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ ఒకటి స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.