పవన్ “ఓజి” థియేట్రికల్ కన్నా ఆడియో హక్కులకే ఎక్కువ ధర..

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో తన ఫ్యాన్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తుండగా పవన్ కెరీర్ లో తన స్టామినాకి తగ్గ భారీ సినిమా కావడంతో దీనిపై గట్టి హైప్ నెలకొంది.

కాగా ఇలాంటి సినిమాకి బిజినెస్ ఏ లెవెల్లో ఉండాలి. కానీ ఈ చిత్రం కి షాకింగ్ బిజినెస్ జరుగుతున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కాగా ఈ చిత్రం ఓజి కి థియేట్రికల్ బిజినెస్ కంటే కేవలం ఆడియో హక్కుల ధరే ఎక్కువ పలికింది అంటే నమ్ముతారా? కానీ ఇది నిజమే అట.

సినిమా ఓవర్సీస్ మార్కెట్ యూఎస్ మార్కెట్ లో కేవలం 17 కోట్ల మేర బిజినెస్ మాత్రమే జరిగితే ఓజి ఒక్క ఆడియో హక్కులని ప్రముఖ మ్యూజిక్ సంస్థ సోనీ మ్యూజిక్ వారు ఏకంగా 20 కోట్లు పెట్టి కొన్నారట. దీని బట్టి థియేట్రికల్ హక్కులు కన్నా ఓజి ఆడియో హక్కులకు డిమాండ్ గట్టిగా ఉందని చెప్పాలి.

కానీ పవన్ సినిమా అందులోని ఈ రేంజ్ భారీ సినిమాకి ఇంత తక్కువ ఓవర్సీస్ ధర అనేది చాలా మందికి షాకింగ్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. అలాగే RRR నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.